Pendurthi: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష!

Pendurthi: పెందుర్తి సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో జనసేన నేతలతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమీక్షా సమావేశం. కూటమి విజయంపై దిశానిర్దేశం.

GOPI, PENDURTHI
Published on: 21 Sept 2026 4:20 PM IST
Pendurthi
X

Pendurthi: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష!

Pendurthi: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల భారీ మెజారిటీయే లక్ష్యంగా ప్రతి జనసేన కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు.

​పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. జీవీఎంసీ పరిధిలోని అగనంపూడి జోన్ మరియు పెందుర్తి జోన్ల పరిధిలోని ఆయా వార్డుల జనసేన పార్టీ నాయకులు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. వార్డుల వారీగా పార్టీ బలాబలాలు, ఎన్నికల వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక పోరులో కూటమి విజయాన్ని ఏకపక్షం చేసేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అగనంపూడి, పెందుర్తి జోన్ల వార్డుల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI