Pendurthi: పెందుర్తిలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే!
Pendurthi: నియోజకవర్గ తాగునీటి సమస్యలను పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌కు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వినతి. ఎంపీ భరత్‌తో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్న వైనం.
Pendurthi: పెందుర్తిలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే!
విశాఖ: విశాఖ పార్లమెంటు సభ్యులు భరత్ గారు మరియు జీవీఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు
ఈరోజు 11.09.2026 తేదీన విశాఖపట్నం VMRDA సమావేశ మందిరంలో విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్ గారు మరియు జీవీఎంసీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు పాల్గొన్నారు.
అనంతరం జీవీఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్ గారిని కలిసి పెందుర్తి నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలపై వినతిపత్రం అందజేశారు ఈ యొక్క వినతిపత్రం లో ముఖ్యంగా వెంకటాద్రి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా తాగునీటి సౌకర్యం కల్పించాలి.
పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రి (CHC)లో రోగులు, సహాయకుల కోసం తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలి అపార్ట్‌మెంట్లు, ఇళ్లలో ఫ్లోరైడ్ తో కలుషితమైన భూగర్భ జలాల కారణంగా తాగునీటికి ఇబ్బంది కారణంగా సురక్షితమైన ట్రీటెడ్ వాటర్ సరఫరా చేయాలి పెందుర్తి అగనంపూడి జోన్లలో లోతట్టు, నీటి ఎద్దడి ప్రాంతాల్లో హ్యాండ్ బోర్లు మంజూరు చేయాలని ఎత్తైన ప్రాంతాలకు PWS పథకాల ద్వారా తాగునీరు అందించాలి,
పాత పథకాలను బలోపేతం చేసి గతంలో ఇచ్చిన తాగునీటి ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్న అన్నింటిని వెంటనే మంజూరు చేయాలని నియోజకవర్గంలో సురక్షిత తాగునీరు అందించేందుకు ఫీల్డ్ తనిఖీలు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరారు.




