Visakhapatnam: విశాఖ రాంనగర్ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా పోస్టర్ ఆవిష్కరణ!

Visakhapatnam: విశాఖపట్టణం రాంనగర్‌ శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 8 Oct 2026 12:04 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ రాంనగర్ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా పోస్టర్ ఆవిష్కరణ!

Visakhapatnam: రాంనగర్‌లోని శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను విశాఖ జనసేన అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దసరా మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, విశాఖ నగరం సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఆలయ అధ్యక్షుడు మార్గాన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాంనగర్ శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, 28వ వార్డు నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

– మార్గాన వెంకటేశ్వరరావు ఆలయ అధ్యక్షుడు, 28వ వార్డు, రాంనగర్

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.