Anakapalli: గుడ్డిప గ్రామంలో దోమల తెరల పంపిణీ
Anakapalli: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గుడ్డిపలో మాజీ ఎంపీటీసీ గంజి సూర్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామీణులకు దోమల తెరల పంపిణీ.
Anakapalli: గుడ్డిప గ్రామంలో దోమల తెరల పంపిణీ
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గుడ్డిప గ్రామంలోని గదభపాలెం, పారగోటపాలెంలలో ఈరోజు మాజీ ఎంపీటీసీ గంజి సూర్యనారాయణ చేతుల మీదుగా స్థానిక ప్రజలకు దోమల తెరలను పంపిణీ చేశారు.
సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, నాయకులు మజ్జి అప్పారావు, చినబాబులు, ఎర్రి నాయుడు, మండల itdp అధ్యక్షులు గల్లా నాని బాబు మరియు కూటమి నాయకులు, స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.




