Anakapalli: లక్ష్మీదేవిపేట ఫ్లైఓవర్‌కు ₹90 కోట్లు మంజూరు!

Anakapalli: అనకాపల్లి లక్ష్మీదేవిపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ₹90 కోట్లు మంజూరు చేయించిన ఎంపీ సీఎం రమేష్‌కు టీడీపీ నాయకులు కొణతాల శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 10 Oct 2026 8:25 AM IST
Anakapalli
X

Anakapalli: లక్ష్మీదేవిపేట ఫ్లైఓవర్‌కు ₹90 కోట్లు మంజూరు!

Anakapalli: అనకాపల్లి రైల్వే స్టేషన్ దగ్గర లక్ష్మీదేవి పేట దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి కు 90 కోట్లు నిధులు మంజూరు చేయించి టెండర్ల ప్రక్రియకు దూసుకు వెళ్లే విధంగా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సి.ఎమ్. రమేష్ కు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి మండల పార్టీ మాజీ అధ్యక్షులు కొణతాల శ్రీనివాసరావు ఈరోజు ఉదయం వారి స్వగృహములో జరిగిన విలేకరుల సమావేశంలో ధన్యవాదములు తెలియజేసారు.

విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి లక్ష్మీదేవి పేట రైల్వే గేటు వర్షం పడిన, రైల్వే గేట్ వేసిన ప్రజలు నరకం చూస్తున్నారని, 10 సంవత్సరాల క్రితం రైల్వే బ్రిడ్జికి శంకుస్థాపన చేసి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతామని ప్రకటించిన, కొంతమంది అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, మాడుగులు చోడవరం అనకాపల్లి నియోజకవర్గ గ్రామీణ ప్రాంత ప్రజలు నానా ఆగచాట్లు పడుతున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తపరిచారు.

ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అనేక మందికి ప్రయోజనం కలుగుతుందని, నాలుగు నియోజకవర్గాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకుండా ఉండిపోవడం వల్ల, అటు విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి, ఇటు లక్ష్మీదేవి పేట రైల్వే గేట్ వల్ల ప్రయాణికులకు వాహనదారులకు గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, లక్ష్మీదేవి పేట రైల్వే బ్రిడ్జి పూర్తి చేసి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, ఇటు రైతులు భూములకు, అటు ఉద్యోగస్తులకు, రైల్వే ప్రయాణికులకు, బెల్లం వ్యాపారులకు ప్రజలకు ఉపయోగపడుతుందని, దీనికి ఆటంకాలు కలిగించిన వారికి వారు ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నట్లేనని, దీర్ఘకాలిక సమస్యకు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ సమస్య పరిష్కారానికి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నందున సంబంధిత శాఖ అధికారులు రైల్వే శాఖ మంత్రి అందరితో అనకాపల్లి లక్ష్మీదేవి పేట రైల్వే గేట్, రైల్వే బ్రిడ్జి ఆవశ్యకతను వివరించి 90 కోట్లు నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనతో చేస్తున్న పనులకు ఆటంకం కలిగించడం న్యాయంగా లేదని, అభివృద్ధిని అడ్డుకోవడమేనని, లక్ష్మీదేవి ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఏమైనా ఉంటే శాసనసభ్యులు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటారని, వీరి ద్వారా మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని శ్రీనివాస రావు అన్నారు.

ముఖ్యంగా లక్ష్మీదేవి పేట రైల్వే ప్లే ఓవర్ బ్రిడ్జికి రూ. 90 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు. కార్యక్రమంలో టి.ఎ న్.టి.యు.సి. మండల అధ్యకులు గొర్లి శ్రీనివాసరావు, మాజి ఎస్.ఎమ్.సి. చైర్మన్ ఆకుల శ్రీనివాసరావు, మాజీ పి.హెచ్.సి. అధ్యక్షులు బొడ్డపాటి గంగా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI