Visakhapatnam: గోపాలపట్నంలో ఆధునిక క్రీడా వసతులు ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్
Visakhapatnam: గోపాలపట్నం హైస్కూల్ గ్రౌండ్‌లో రూ.1.22 కోట్లతో అభివృద్ధి చేసిన ఆధునిక క్రీడా ప్రాంగణాలను ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు.
Visakhapatnam: గోపాలపట్నంలో ఆధునిక క్రీడా వసతులు ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్
విశాఖపట్నం: విశాఖపట్నం పశ్చిమ లో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గోపాలపట్నం హైస్కూల్ గ్రౌండ్‌లో రూ.1.22 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసిన క్రీడా ప్రాంగణాలు, విద్యుత్ సౌకర్యాలను విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ గారు శుక్రవారం ప్రారంభించారు.
జీవీఎంసీ పశ్చిమ జోన్ పరిధిలోని 92వ వార్డులో, జీవీఎంసీ సాధారణ నిధులతో చేపట్టిన ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్ కోర్టు, బాక్స్ క్రికెట్, పికిల్‌బాల్ కోర్టు, హైమాస్ట్ లైటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో కలిసి ప్రాంగణాన్ని ప్రారంభించారు.. ఈ వసతులు స్థానిక ప్రజలకు, యువతకు, క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి మౌలిక సదుపాయాలు దోహదపడతాయని శ్రీభరత్ అన్నారు.. ప్రజలు నిత్యం వ్యాయామం చేసేందుకు, యువ క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఈ క్రీడా ప్రాంగణం ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు...బాల్ బాడ్మింటన్, వాలీబాల్ కోర్ట్ , క్రికెట్ మైదానాల్లో ఒక క్రీడాకారుడిగా మారిపోయి తన క్రీడా పటిమను చాటుకున్నారు.




