Madhurawada: 9వ వార్డు కూటమి అభ్యర్థిగా నాగోతి రూపకుమారి!

Madhurawada: జీవీఎంసీ 9వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా నాగోతి రూపకుమారి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు గంట రవితేజ చేతుల మీదుగా బీ-ఫారం అందుకున్నారు.

JAI RAM, MADURAWADA
Published on: 21 Oct 2026 5:24 PM IST
Madhurawada
X

Madhurawada: 9వ వార్డు కూటమి అభ్యర్థిగా నాగోతి రూపకుమారి!

మధురవాడ: 9వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా నాగోతి రూపకుమారి బీ-ఫారం అందుకున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు గంట రవితేజ ఆమెకు బీ-ఫారం అందజేశారు. నాగోతి వెంకట సత్యనారాయణ సతీమణి అయిన రూపకుమారి 9వ వార్డు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

ఈ సందర్భంగా నాగోతి రూపకుమారి మాట్లాడుతూ, 9వ వార్డులోని ప్రజా సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. వార్డులోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA