Anakapalli: 24 గంటల్లో చోరీ కేసు ఛేదించిన నక్కపల్లి పోలీసులు
Anakapalli: అనకాపల్లి జిల్లాలో 15 లక్షల బంగారం చోరీ కేసును నక్కపల్లి పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Anakapalli
Anakapalli: అనకాపల్లి జిల్లాలో జరిగిన చోరీ కేసును నక్కపల్లి పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. నక్కపల్లి మండలం ముకుందరాజుపేట గ్రామానికి చెందిన మనబాల రమణ ఇంట్లో జరిగిన చోరీలో సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, దాదాపు రూ.15 లక్షల విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయి.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా చోరీకి పాల్పడింది బాధితుడి బంధువు పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన కొల్లి శ్రీను అని గుర్తించారు.
నిందితుడిని వేంపాడు టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు నక్కపల్లి సీఐ మురళి తెలిపారు. అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story




