Narasapuram: పండ్ల బుట్ట గుర్తుకు ఓటేసి అన్నదాతను కాపాడుదాం: రంగారావు!

Narasapuram: నరసాపురం జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి కూనపురెడ్డి నాగ వెంకటలక్ష్మిని పండ్ల బుట్ట గుర్తుపై గెలిపించాలని రైతు నాయకుడు కూనపురెడ్డి రంగారావు పిలుపునిచ్చారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 29 Oct 2026 5:49 PM IST
Narasapuram
X

Narasapuram: పండ్ల బుట్ట గుర్తుకు ఓటేసి అన్నదాతను కాపాడుదాం: రంగారావు!

నరసాపురం: నరసాపురం మండలం జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూనపురెడ్డి నాగ వెంకటలక్ష్మిని పండ్ల బుట్ట గుర్తుపై ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని రైతు, ప్రజా సమస్యల పోరాట నాయకుడు కూనపురెడ్డి వీర వెంకట విజయ్ రంగారావు పిలుపునిచ్చారు. గురువారం నరసాపురంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా ఓటర్లు స్పందించి, స్వతంత్ర అభ్యర్థిని ఆదరించాలని ఆయన కోరారు. ఎన్నికల్లో ఏ పంచాయతీలో అయితే తమకు అత్యధిక మెజారిటీ లభిస్తుందో, ఆ గ్రామంలో తన భార్య వీర వెంకట అనంత లక్ష్మి పేరిట ప్రత్యేక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపడతామని రంగారావు ఈ సందర్భంగా ప్రకటించారు. అన్నదాతలను ఆదుకోవడానికి, ప్రజా సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM