Narsipatnam: నర్సీపట్నంలో ఘనంగా బ్రహ్మకుమారీస్ శాంతి యాత్ర ప్రారంభం!
Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యసన ముక్త భారత్ ప్రచార యాత్ర, కార్తీక మాస వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Narsipatnam: నర్సీపట్నంలో ఘనంగా బ్రహ్మకుమారీస్ శాంతి యాత్ర ప్రారంభం!
నర్సీపట్నం: ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యసన ముక్త భారత్ ప్రచార యాత్ర, కార్తీక మాస వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్పర్సన్ చింతకాయల పద్మావతి నివాసంలో శివలింగానికి ఆమె, చిన్న కోడలు దివ్యశ్రీ ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు.
అనంతరం మహిళలు కలశాలతో శాంతి యాత్ర చేపట్టారు. ఈ నెల 16 నుంచి 25వ తేదీ వరకు కొనసాగే యాత్రలో భాగంగా వివిధ గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో వ్యసన విముక్తి, ఆధ్యాత్మికతపై అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ నర్సీపట్నం ఇన్చార్జ్ బీకే వేణు, బీకే లక్ష్మి, బీకే సోమేశ్వరి, బీకే లలిత తదితరులు పాల్గొన్నారు.




