Anakapalle: లేబర్ బోర్డులో ఆఫ్‌లైన్ అనుమతివ్వాలి: సీఐటీయూ!

Anakapalle: నర్సీపట్నం ఏఎన్‌ఎల్‌ఓ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికుల ధర్నా. సంక్షేమ బోర్డులో ఆఫ్‌లైన్ ద్వారా సభ్యత్వ నమోదును అనుమతించాలని డిమాండ్.

R. A. Naidu, Narsipatnam
Published on: 30 Sept 2026 12:44 PM IST
Anakapalle
X

Anakapalle: లేబర్ బోర్డులో ఆఫ్‌లైన్ అనుమతివ్వాలి: సీఐటీయూ!

Anakapalle: ఈరోజు నర్సీపట్నం ఏ ఎల్ ఓ కార్యాలయం వద్ద , అనకాపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల ఎదుర్కొంటున్న సంక్షేమ బోర్డులో సభ్యత్వం నమోదుకు ఆఫ్లైన్లో అనుమతించాలని, ప్రమాద బీమా 5 లక్షల నుండి 10 లక్షల పెంచి అమలు చేయాలని, 2019 నుండి 2026 ఏప్రిల్ వరకు పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ విడుదల చేయాలని, భావన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ,గృహ నిర్మాణానికి ఋణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

భవనిర్మాణ సంక్షేమ బోర్డులో కోట్లాది రూపాయలు మురుగుతున్న కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టడం లేదు, బేబీ కిట్లుకి ,ప్రభుత్వ ప్రచారాలకి బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వాడుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కే .రామకృష్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ .సత్తిబాబు,D. శివ, గాలి రమణ, మర్రి రమణ, రాము ,p. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam