Narsipatnam: గెలిచిన జనసేన కౌన్సిలర్లను సత్కరించిన ఎంపీ విజయ్

Narsipatnam: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన జనసేన కౌన్సిలర్లు పంచాడ హరినాథ్, రామకృష్ణలను గజమాలతో సత్కరించిన రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్.

R. A. Naidu, Narsipatnam
Published on: 4 Nov 2026 4:10 PM IST
Narsipatnam
X

Narsipatnam: గెలిచిన జనసేన కౌన్సిలర్లను సత్కరించిన ఎంపీ విజయ్

​నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలుపొందిన కూటమి (జనసేన) నాయకులు పంచాడ హరినాథ్, రామకృష్ణలను రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎన్నికైన వీరిద్దరినీ ఆయన గజమాలతో సత్కరించి, ప్రత్యేకంగా అభినందించారు.

​ఈ సందర్భంగా ఎంపీ విజయ్ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సూర్యచంద్ర, తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam