Narsipatnam: కూటమి మాయమాటలు నమ్మి మోసపోవద్దు: పెట్ల ఉమా శంకర్ గణేష్!

Narsipatnam: నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి చింతకాయల అనిత, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 25 Oct 2026 6:52 PM IST
Narsipatnam
X

Narsipatnam: కూటమి మాయమాటలు నమ్మి మోసపోవద్దు: పెట్ల ఉమా శంకర్ గణేష్!

నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపి మునిసిపల్ చైర్పర్సన్ అభ్యర్థి చింతకాయల అనిత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 23 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థి అల్లం పెళ్లి లావణ్య లతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేశారు.

ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసి పాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతకాయల అనిత మాట్లాడుతూ, నర్సీపట్నంలో ట్రాఫిక్ సమస్య, డ్రైనేజీ సమస్యలు క్రమబద్ధీకరణ చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు.

మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ఆచరణ యోగ్యం కానీ హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి మోసపోయారని, మరోసారి మోసపోవద్దని పట్టణ ప్రజలకు ఆయన సూచించారు. భారీ మెజారిటీతో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam