Narsipatnam: నర్సీపట్నంలో 2 కిలోల ద్రవరూప గంజాయి స్వాధీనం
Narsipatnam: ఒడిశా నుంచి బైక్‌పై తరలిస్తున్న 2 కిలోల ద్రవరూప గంజాయిని నర్సీపట్నంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇద్దరు అరెస్ట్, బైక్ సీజ్ అని తెలిపిన DSP.
Narsipatnam: నర్సీపట్నంలో 2 కిలోల ద్రవరూప గంజాయి స్వాధీనం
నర్సీపట్నం: ఒడిస్సా రాష్ట్రంలో కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న రెండు కిలోల ద్రవరూప గంజాయిని(ఆశిష్ ఆయిల్ )పోలీసుల తనిఖీల్లో పట్టుకున్నారు.
విలేకరుల సమావేశంలో డిఎస్పి శ్రీనివాసరావు తెలియజేసిన వివరాలు ఎలా ఉన్నాయి. నర్సీపట్నం మండలం, డిగ్రీ కాలేజీ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా, మోటార్ సైకిల్ పై తరలిస్తున్న రెండు కిలోల ద్రవరూప గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు. రిమాండ్ కు తరలింపు. రెండు సెల్ ఫోన్లు స్వాధీనం. గంజాయిని తరలించేందుకు వినియోగించిన మోటార్ సైకిల్ సీజ్.




