Nathavaram: క్రీడాకారులకు టీ-షర్టులు అందించిన నాతవరం ఎస్‌ఐ!
Nathavaram: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు వెళ్తున్న అనకాపల్లి జిల్లా జట్లకు నాతవరం పోలీసుల టీ-షర్టుల పంపిణీ, రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత.
Nathavaram: క్రీడాకారులకు టీ-షర్టులు అందించిన నాతవరం ఎస్‌ఐ!
Nathavaram: అనకాపల్లి జిల్లా సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ బాలబాలికల జట్లు రాష్ట్ర స్థాయి పోటీలతో పాటు నేషనల్ సెలక్షన్స్‌లో పాల్గొనేందుకు విజయనగరం జిల్లా బొబ్బిలికి ,కోచింగ్ క్యాంప్ అనంతరం బయలుదేరుతున్న సందర్భంగా నాతవరం జడ్పీ హైస్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా అనకాపల్లి జిల్లా పోలీస్ తరఫున తరఫున ఎస్‌ఐ తారకేశ్వరరావు గారు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న 36 మంది క్రీడాకారులకు టీ-షర్టులను స్పాన్సర్ చేసి అందజేశారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. యువత మాదకద్రవ్యాలు కు బానిసవ్వకుండా క్రీడలు పట్ల ఉత్సాహము చూపించాలని కోరారు.
అదేవిధంగా అనకాపల్లి జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ శెట్టి సతీష్ గారు క్రీడాకారుల రవాణా ఖర్చులు మరియు ఎంట్రీ ఫీజుల నిమిత్తం రూ.10,000/- నగదును కోచ్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ రవి గారికి అందజేశారు.
జిల్లా సాఫ్ట్‌బాల్ సీఈఓ శ్రీ వెలగా వెంకట కృష్ణారావు గారు అనకాపల్లి జిల్లాలో సాఫ్ట్‌బాల్ క్రీడాభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించేందుకు, త్వరలో జిల్లా జట్లకు అవసరమైన సాఫ్ట్‌బాల్ కిట్లను సమకూర్చి అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా తాండవ చైర్మన్ శ్రీ కరక సత్యనారాయణ గారు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ సూర్య చంద్ర గారు, అనకాపల్లి జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ తారకు వేణుగోపాల్ గారు, కార్యదర్శి శ్రీ పి. నూకరాజు గారు, కన్వీనర్ శ్రీ కె. సతీష్ గారు, ట్రెజరర్ శ్రీ శెట్టి లోవ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎల్.వి. రమణ గారు, సిహెచ్ దశరథ రామ్, మరియు
నాతవరం కోఆపరేటివ్ ప్రెసిడెంట్ శ్రీ మాణిక్యం గారు, పారుపల్లి కొండబాబు గారు, శ్రీ వై. కాశీ గారు, జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం శ్రీ కుండ్రపు సత్యనారాయణ గారు తదితరులు పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
కరక సత్యనారాయణ గారు మాట్లాడుతూ నాతవరం నుండి నలుగురు క్రీడాకారులు అనకాపల్లి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించడం ఆనందమని,
క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి ఎంపికల్లో కూడా విజయం సాధించి అనకాపల్లి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
క్రీడలకు పోలీసుల సహకారం – యువతకు ప్రోత్సాహం, ప్రతిభకు ప్రోత్సాహకం అనే లక్ష్యంతో నాతవరం పోలీసుల ఆధ్వర్యంలో చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ భాగంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.




