Narsipatnam: జాతీయ పత్రికా దినోత్సవం.. నర్సీపట్నంలో వ్యాసరచన పోటీలు!
Narsipatnam: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే, నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీవిద్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
Narsipatnam: జాతీయ పత్రికా దినోత్సవం.. నర్సీపట్నంలో వ్యాసరచన పోటీలు!
Narsipatnam: జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నర్సీపట్నం శ్రీవిద్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. "డ్రగ్స్ రహిత సమాజం మీడియా - పోలీస్ పాత్ర" అనే అంశంపై ఈ పోటీలు ఏర్పాటు చేశారు.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం రోజున ప్రతి ఏటా దేశంలో జాతీయ పత్రిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.బి.ఎల్. స్వామి తెలిపారు. ఇందులో భాగంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకునే ఈనెల 16వ తేదీ సోమవారం విజేతలకు బహుమతి ప్రధానం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీవిద్య కాలేజీ సంస్థల కరస్పాండెంట్ గాడి సత్యవతి, డైరెక్టర్ బోలెం అప్పన్న దొర, తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో డిగ్రీ కళాశాల విద్యార్థులు వ్యాసరచన పోటీ లకు హాజరయ్యారు.




