Buchayyapeta: బుచ్చయ్యపేటలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ప్రత్యేక అవగాహన!
Buchayyapeta: బుచ్చయ్యపేటలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి, 80 శాతం రాయితీపై ప్రత్యామ్నాయ పంట విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Buchayyapeta: బుచ్చయ్యపేటలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ప్రత్యేక అవగాహన!
Buchayyapeta: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలోని బుచ్చయ్యపేట మండలం బుచ్చయ్యపేట గ్రామంలో వరి నాట్లు వేసిన పొలాలను మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి, మండల వ్యవసాయ అధికారి క్షేత్రస్థాయిలో రైతు సేవా కేంద్రం సిబ్బంది మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సమన్వయంతో రైతులు యొక్క పొలాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎకరానికి 20 కేజీల అజోల్ల వేయటం వలన నేలలో నత్రజని శాతం పెరిగి అదే విధంగా కలుపు ఉద్రిక్తతను కూడా సహజ సిద్ధంగా నిర్మూలనకు, భూసారం మెరుగుపడుటకు ఎంతగానో ఉపయోగపదుతుందని రైతులకు తమ పొలాల వద్ద అవగాహన కల్పించడం జరిగింది . మరియు అదే విధంగా పసుపుపచ్చ కార్డులు కూడా రైతు పొలాలలో అమర్చడం జరిగింది.
వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు ప్రకృతి సేద్య సిబ్బందితో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటివరకు మండలంలో 2415 హెక్టర్లు గాను 957 హెక్టర్లు నాట్లు వేయడం జరిగింది ఇంకా ఎవరైతే రైతులు తమ యొక్క పొలాలలో వరి నాట్లు వేయలేని వాళ్ళని గుర్తించి అందరి చేత కూడా మిగిలిన విస్తీర్ణంలో సేంద్రీయ పద్ధతి ద్వారా గాని గడ్డి విత్తనాలతో పాటు ప్రత్యామ్నాయ పంటలైన రాగి, జనుము, ఉలవలు సాగు చేసేలాగా రైతులకి సమావేశం ఏర్పాటు చేసి రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలను సరఫరా చేయుటకు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నాము.
రైతులందరికీ 80%శాతం రాయితీతో పంపిణీ చేయబడును కావలిసిన రైతులు అందరూ మీ సమీపంలో ఉన్న రైతు సేవ కేంద్రం వెళ్లి మీ యొక్క పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ పట్టుకువెళ్లి తీసుకోవలెను.
రకం-ఉలవలు
పూర్తి ఖరీదు-74
రాయితి-59.2
రైతు వాటా -14.80
రకం-జనుము
పూర్తి ఖరీదు-154
రాయితి-123.2
రైతు వాటా -30.80
రకం-రాగి
పూర్తి ఖరీదు-76
రాయితి-60.80
రైతు వాటా -15.20
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సాయివాని జ్యోతి రైతు సేవా కేంద్రం సిబ్బంది మరియు ప్రకృతి వ్యవసాయ మండల ఇన్చార్జెస్ దేవి, వాకుబ మరియు గ్రామస్థాయి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.




