Chintoor: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన చింతూరు వైఎస్ఆర్సీపీ బృందం!
Chintoor: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన చింతూరు మండల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల బృందం తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.
Chintoor: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన చింతూరు వైఎస్ఆర్సీపీ బృందం!
Chintoor: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చింతూరు మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం తాడేపల్లిలో కలిసింది.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చింతూరు మండలంలో జడ్పీటీసీ స్థానంతో పాటు మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ భేటీలో రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి, చింతూరు మండల కన్వీనర్ వై. రామలింగారెడ్డి,
నూతన జడ్పీటీసీ సవలం అమల, ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చిచ్చడి మురళి, మాజీ వైస్ ఎంపీపీ మేడేపల్లి సుధాకర్ (చిన్ని), వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కోట్ల కృష్ణ, మహిళా నాయకురాలు యగుమంటి శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలంలో ఎన్నికల ఫలితాలు, ప్రజల సమస్యలపై చర్చ జరిగినట్లు సమాచారం.




