Vizag: విశాఖ కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి బర్త్‌డే వేడుకలు
Vizag: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ (OBC) రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంచార్జి కేవీఎస్ జన్మదిన వేడుకలు.
Vizag: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంచార్జి కేవీఎస్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా సీనియర్ నాయకురాలు మాకెన లక్ష్మీ కేవీఎస్‌కు శాలువా కప్పి సత్కరించి అభినందించారు. దక్షిణ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆమె ఆకాంక్షిస్తూ, విశాఖలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, పార్టీ అభివృద్ధికి ఏ అవసరం అయినా తాను ఎప్పుడూ ముందుంటానని ఆమె భరోసా ఇచ్చారు.
కేవీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఓబీసీ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించారు. జిల్లా స్థాయి నుంచి మండల, వార్డు స్థాయి వరకు పటిష్టమైన కమిటీలను నియమించి, ఓబీసీ వర్గాలను పార్టీలో మరింత చురుగ్గా భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నారు.
కేవీ సూర్యనారాయణ మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, విశాఖ జిల్లాలో ఓబీసీలను సంఘటితపరిచి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ వేడుకలో ఎస్సీ సెల్ కస్తూరి వెంకటరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందకుమార్, మాజీ మైనారిటీ సెల్ బాషా, 28వ వార్డు అధ్యక్షులు గుర్రం కనకరావు, 54వ వార్డు అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాసరావు, దాసు, సత్యనారాయణ, రజనీకాంత్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




