Visakhapatnam: జీవీఎంసీలో గ్రామాల విలీనం వద్దు స్థానిక ప్రజల స్పష్టమైన హెచ్చరిక

Visakhapatnam: జీవీఎంసీ (GVMC) లో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ స్థానికుల ఆందోళన. పన్నుల భారం, పంచాయతీ నిధులు కోల్పోవడం, ఉపాధి లేకపోవడంపై ఆవేదన.

SHIVA, BHIMILI
Published on: 29 Aug 2026 10:36 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: జీవీఎంసీలో గ్రామాల విలీనం వద్దు స్థానిక ప్రజల స్పష్టమైన హెచ్చరిక

Visakhapatnam: ప్రజలారా ఆలోచించండి! మన మండలాన్ని, గ్రామాలను GVMC (మహా విశాఖ నగర పాలక సంస్థ) లో విలీనం చేయడం వల్ల మనకు ఒరిగేదేమీ లేదు. ఈ విలీనం వల్ల జరిగే నష్టాలను ఒకసారి పరిశీలించండి:

GVMCలోనే కుంటుపడిన అభివృద్ధి: ప్రస్తుతం GVMC పరిధిలోనే ఉన్న అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అక్కడ మురుగునీటి సమస్యలు, విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఉన్న ప్రాంతాలకే నిధులు చాలక అవస్థలు పడుతుంటే, కొత్తగా మన గ్రామాలను కలిపితే మనకు నిధులు ఎలా వస్తాయి?

కేంద్ర ప్రభుత్వ నిధులు కోల్పోయే ప్రమాదం: మన ఊర్లు గ్రామాలుగానే ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీలకు నిధులు వస్తాయి, వాటితో గ్రామాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. GVMC లో కలిస్తే ఆ నిధులను కోల్పోవాల్సి వస్తుంది.

స్థానిక సమస్యలు & ఉపాధి అలక్ష్యం: మన ప్రాంతాల్లో ఉన్న కర్మాగారాలు, పరిశ్రమల నుంచి స్థానిక యువతకు కనీసం ఉపాధి లభించడం లేదు. స్థానిక సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

పెంపొందే పన్నుల భారం: విలీనం పేరుతో భూముల, ఇళ్ల రేట్లు చూపి పన్నులు పెంచడం తప్ప, నిజమైన అభివృద్ధి ఉండదు. రోడ్లు, పార్కులు వేయడం పంచాయతీ పరిధిలోనే సాధ్యమవుతుంది.

గ్రామీణ వాతావరణం, పచ్చదనం మాయం: మన గ్రామాల ప్రత్యేకత అయిన పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం ఈ విలీనం వల్ల కనుమరుగైపోతాయి.

గ్రామాలు గ్రామాలుగానే ఉంటూ అభివృద్ధి చెందాలి తప్ప, మహానగరాల్లో కలిసిపోయి తమ ఉనికిని, ప్రశాంతతను కోల్పోకూడదు. కాబట్టి మన గ్రామాల స్వయంప్రతిపత్తి కోసం, ప్రశాంతమైన జీవనం కోసం GVMC లో విలీనాన్ని గట్టిగా వ్యతిరేకిద్దాం.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story