Paderu: తుఫాను, ఎన్నికల పర్యవేక్షణకు శాటిలైట్ కెమెరాల పరిశీలన!

Paderu: అల్లూరి జిల్లాలో తుఫాను పర్యవేక్షణ, స్థానిక ఎన్నికల నిర్వహణకు శాటిలైట్ కెమెరాల తనిఖీ. కలెక్టర్ నిషాంతి, ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ క్షేత్రస్థాయి పరిశీలన.

SAI, PADERU
Published on: 26 Oct 2026 3:35 PM IST
Paderu
X

Paderu: తుఫాను, ఎన్నికల పర్యవేక్షణకు శాటిలైట్ కెమెరాల పరిశీలన!

Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆదిత్య వర్మ తుఫాను హెచ్చరికలు, రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వినియోగించేందుకు అందుబాటులో ఉన్న శాటిలైట్ కెమెరాలను పరిశీలించారు.

తుఫాను పరిస్థితులను పర్యవేక్షించడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, సంబంధిత శాఖల మధ్య సమన్వయం సాధించడం, ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించడం వంటి అంశాల్లో శాటిలైట్ కెమెరాల వినియోగంపై అధికారులు పరిశీలించారు.

తుఫాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

SAI, PADERU

SAI, PADERU