Paderu: పాడేరులో రూ.59.51 కోట్ల అభివృద్ధి పనులకు కలెక్టర్ శ్రీకారం

Paderu: పాడేరు నియోజకవర్గంలో రూ.59.51 కోట్ల వ్యయంతో 13 బీటీ రోడ్లు, వన్ స్టాప్ సెంటర్, మల్టీ విలేజ్ తాగునీటి పనులకు కలెక్టర్ నిశాంతి శ్రీకారం చుట్టారు.

SAI, PADERU
Published on: 7 Oct 2026 9:29 PM IST
Paderu
X

Paderu: పాడేరులో రూ.59.51 కోట్ల అభివృద్ధి పనులకు కలెక్టర్ శ్రీకారం

పాడేరు: ​పాడేరు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మౌలిక వసతులు కల్పనే లక్ష్యంగా రూ. 59.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ నిషాంతి. టి తెలిపారు. బుధవారం స్థానిక శంకరన్ ఆడిటోరియంలో పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మతో కలిసి

​13 బిటి రోడ్లు, వన్ స్టాప్ సెంటర్ ప్రారంభం, మల్టీ విలేజ్ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... ​మారుమూల గిరిజన గ్రామాలకు అనుసంధానత, ప్రతి ఇంటికీ సురక్షిత మంచి నీరే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు.

​పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దుర్భరమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ, మారుమూల గిరిజన గ్రామాలకు అభివృద్ధి ఫలాలను అందించడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు.

​పంచాయతీ రాజ్ పీఐయూ (PR PIU) విభాగం ఆధ్వర్యంలో రూ. 24.21 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేసిన 13 బిటి (BT) రోడ్లను ప్రజా సమక్షంలో ప్రారంభించామన్నారు. ఈ రహదారుల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ప్రజల ప్రయాణ కష్టాలు తప్పుతాయన్నారు.

​మహిళల భద్రతకు వన్ స్టాప్ సెంటర్

గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా రూ. 1.80 కోట్ల వ్యయంతో నిర్మించిన 'వన్ స్టాప్ సెంటర్' నిర్మించడంతోపాటు ఒక ప్రధాన వంతెనను అందుబాటులోకి తెచ్చామన్నారు.ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా హింసకు గురైన మహిళలకు ఒకే ప్రాంగణంలో రక్షణ, ఉచిత న్యాయ సహాయం, వైద్యం, కౌన్సిలింగ్, పునరావాస సేవలు అందుతాయని వివరించారు.

​ జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు

గ్రామీణ నీటి సరఫరా (RWS) శాఖ ఆధ్వర్యంలో పాడేరు చింతపల్లి మండలాల్లో రూ. 33.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 'మల్టీ విలేజ్ స్కీమ్' (MVS) పనులకు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలు, పిల్లలు తాగునీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా, ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందుతుందని స్పష్టం చేశారు.

​ఏజెన్సీ ప్రాంతంలో ఈ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసిన పిఐయు , గిరిజన సంక్షేమ మరియు గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, ఫీల్డ్ స్టాఫ్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. మన అల్లూరి సీతారామరాజు జిల్లాను మరింత ప్రగతిశీల, అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాడేరు ఐటిడిఏ పీవో ఆదిత్య వర్మ,ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ నాగేశ్వరరావు, పీఆర్ ఈఈ కొండ య్యపడాల్, పిఐయు ఈఈ రామకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ ఈఈ కె. వేణుగోపాల్ , ఆర్ అండ్ బి ఈఈ సాగర్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జిసిసి డైరెక్టర్ బొర్రా నాగరాజు, ట్రై కార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు, మాజీ ఎంపీపీ బుర్ర విజయ రాణి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU