Paderu: జీ.మాడుగుల పివిటీజి గ్రామాల్లో ఐటీడీఏ పిఓ ఆదిత్య వర్మ పర్యటన

Paderu: జీ.మాడుగుల మండలంలో ఐటీడీఏ పిఓ ఆదిత్య వర్మ పర్యటించారు. గిరిజన గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకుని, తాగునీరు, సీసీ రోడ్ల పనులకు ఆదేశాలు ఇచ్చారు.

SAI, PADERU
Published on: 12 Oct 2026 7:33 PM IST
Paderu
X

Paderu: జీ.మాడుగుల పివిటీజి గ్రామాల్లో ఐటీడీఏ పిఓ ఆదిత్య వర్మ పర్యటన

పాడేరు: ఏ ఎస్ ఆర్ జిల్లా పాడేరు జి.మాడుగుల మండలం కె. కోడాపల్లి పంచాయతీ పరిధిలోని పరదేసిపుట్టు గ్రామాన్ని, అలాగే పాలమామిడి పంచాయతీ పరిధిలోని పాలమామిడి పీవీటీజీ (PVTG) గ్రామాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ పర్యటించారు.

సోమవారం ఉదయం జి మాడుగులమండలంలోని పివిటీజి గ్రామాలు పర్యటించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని, సమస్యలకు సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, స్థానిక ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పిల్లలకు, గర్భిణీలకు అందాల్సిన పౌష్టిక ఆహారము, న్యూట్రిన్ పోషకాలు అందించే విధానంపై అడిగి తెలుసుకుని, పిల్లలకు గర్భిణీలకు అందించాల్సిన న్యూట్రిన్ ఫుడ్ ను కచ్చితంగా అoదే విధంగా చూడాలన్నారు.

గ్రామంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఆయా గ్రామాలకు సీసీ రోడ్లు, సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ప్రాజెక్ట్ అధికారికి విన్నవించారు. ప్రజలు తెలిపిన సమస్యలకు స్పందించి , అంశాలపై వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి అడిగి తెలుసుకొని మంచినీటి ఏర్పాట్లను ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, సమస్యలను పరిష్కరించే దిశగా చూడాలని అధికారులు ఆదేశించారు.

అలాగే ఇళ్ల నిర్మాణం పనులు పరిశీలించి, పరిస్థితులపై ఆరా తీశారు. పనులు సంబందించిన పెండింగ్ బిల్లుల విడుదల పై సంబంధిత ఇంజనీరింగ్, గృహ నిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేసారు. పీఎం జన్ మన్ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లకు పెడింగ్ పేమెంట్స్ ను చెల్లించే విదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే గ్రామంలో సీసీ రోడ్డు లు నిర్మాణ పనులు కూడా పరిశీలించి త్వరతగతిన పూర్తి చెయ్యాలన్నారు.

ఆయా గ్రామాల కాఫీ రైతులతో మాట్లాడి, కాఫీ పంట పై పలు సూచనలు, సలహాలు చేసి,కాఫీ ద్వారా అందుతున్న సబ్సిడీలను వారికి వివరించారు. కాఫీ పంట ద్వారా లభించిన ఆదాయాన్ని పొదుపుగా, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని గ్రామస్తులను , కాఫీ రైతులకు ప్రాజెక్ట్ అధికారి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి వారితోపాటు ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి (పి వి టి జి )ఎం. వెంకటేశ్వరరావు, జి మాడుగుల సిడిపిఓ కె.దేవి స్థానిక పాలమామిడి అంగన్వాడీ టీచర్ కుమారి , కాఫీ ఏఈఓ, లైసెన్ వర్కర్స్, ఇతర అధికారులు, సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU