Paderu: ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో ఐడీ కార్డుల పంపిణీ
Paderu: పాడేరులో వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు. స్థానిక ఎన్నికలే మనకు కీలకమని పిలుపు.
Paderu: ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో ఐడీ కార్డుల పంపిణీ
పాడేరు: పాడేరు లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల స్థాయి ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమంలో శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు పాల్గొని మండలంలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఐడి కార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ఉద్దేశించి శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్తకు గుర్తించాలని ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులకు, కార్యకర్తలకు ఐడి కార్డులు అందజేసి కార్యక్రమం శ్రీకారం చుట్టరని, కార్యకర్తలకు గుర్తించినందుకు జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
గ్రామ కమిటీ మరియు నాయకులు ప్రతి పంచాయితీ గ్రామాల్లో వెళ్లి వెన్నుపోటు ప్రభుత్వం చేసిన మోసాలు ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ పడకుండా మన పార్టీ నుండి ఎవరిని నియమిస్తామో వాళ్లకే గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు.
ఆశావాహులు ఉంటారు కొందరికి న్యాయం చెయ్యలేదని బాధపడొద్దు మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది అందరు కలిసి జగనన్నకి ముఖ్యమంత్రి గా చేసుకుందాం ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలే మనకు కీలకం గెలిసిన తరువాత కూటమి నాయకులు డబ్బులు, లేదా మీ మండలంలో పంచాయితీల్లో అభివృద్ధికి నిధులు ఇస్తాం అని మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు.
మన ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు కావున ఎవ్వరు పార్టీకి ద్రోహం చేయొద్దు అని నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కురూస పార్వతమ్మ, మండల పార్టీ అధ్యక్షులు సీధరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్న దొరా, వైస్ ఎంపీపీ కుంతురు కనకాలమ్మ, పార్టీ సీనియర్ నాయకులు గబ్బడ చిట్టిబాబు, రాష్ట్ర,జిల్లా, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు, గ్రామ పంచాయితీ కమిటీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




