Paderu: అనంతగిరి, అరకు, డుంబ్రిగుడలో ఎన్నికల పరిశీలకుడు కూర్మానాథ్ తనిఖీలు

Paderu: అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్ ఆర్. కూర్మానాథ్.

SAI, PADERU
Published on: 21 Oct 2026 8:51 PM IST
Paderu
X

Paderu: అనంతగిరి, అరకు, డుంబ్రిగుడలో ఎన్నికల పరిశీలకుడు కూర్మానాథ్ తనిఖీలు

పాడేరు: అరకు / అనంతగిరి/డుంబ్రిగుడ, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జనరల్ ఎన్నికల పరిశీలకులు ఆర్. కూర్మానాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో సమగ్రంగా అనంతగిరి అరకు డుంబ్రిగూడ మండలాలు పరిశీలించారు.

అనంతగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన తొలుత తనిఖీ చేశారు. అనంతరం జీటీడబ్ల్యూఏ (GTWA) పాఠశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్ మరియు ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని (కౌంటింగ్ సెంటర్) సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

అలాగే అరకు ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను, స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం డుంబ్రిగుడ మండలంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఎన్నికలకు సిద్ధం చేసిన బ్యాలెట్ బాక్సులను స్వయంగా తనిఖీ చేసి అధికారులకు తగిన మార్గదర్శకాలు జారీ చేశారు. తిరిగి పాడేరు పిఎంఆర్సి అతిథి గృహం చేరుకున్నారు. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ వారి ఫోన్ నెంబర్: 7989108836, 7999111222,

ఈ పరిశీలన కార్యక్రమంలో జడ్పిటిసి ఎంపిటిసి జనరల్ అబ్జర్వర్ లైజాన్ అధికారి, ఏడి సర్వే అధికారి ఈశ్వర్ దొర, జిల్లా టూరిజం అధికారి పట్టాసి.చలపతి, అనంతగిరి మండల ప్రత్యేక అధికారి మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.ఏ స్వామి నాయుడు, మండల అభివృద్ధి అధికారి కె.ప్రభాకర్ రావు, మండల తహశీల్దార్ వీరభద్రాచారి, అరకు మండలం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏం శ్రీధర్, ఎంపీడీవో ప్రసాద్, మండల తహశీల్దార్ శ్రీధర్ రాజు, డుంబ్రిగుడ రిటర్నింగ్ అధికారి రహీం, మండల తహశీల్దార్ శంకర్రావు, మండల అభివృద్ధి అధికారి సిహెచ్ విశ్వనాథం, మూడు మండలాల స్ట్రాంగ్ రూమ్స్ ఇన్చార్జి , పాడేరు ఎస్ఎంఐ ఈ ఈ రాజేంద్ర కుమార్ , స్థానిక మండలం ఎన్నికల అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU