Salur: చినుకు పడితే చిక్కులే.. పారన్నవలస గ్రామస్తుల అవస్థలు!
Salur: సాలూరు మండలం పారన్నవలసలో వర్షాకాలం వస్తే రాకపోకల తీవ్ర ఇబ్బందులు. అసంపూర్తిగా ఉన్న కూరగెడ్డ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి శాశ్వత దారి చూపాలని విజ్ఞప్తి.
Salur: చినుకు పడితే చిక్కులే.. పారన్నవలస గ్రామస్తుల అవస్థలు!
Salur: సాలూరులో చినుకు పడితే చాలు.. పారన్నవలస గ్రామస్తుల్లో ఆందోళన మొదలవుతోంది. సాలూరు పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ, వర్షాకాలంలో రాకపోకల సమస్యతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామానికి ఒకవైపు వేగావతి నది, మరోవైపు కూరగెడ్డ ఉండటంతో వర్షాలు కురిసిన సమయంలో రాకపోకలు అంతరాయం కలుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, కూలీలు, ఉద్యోగులు, సాలూరు–బొబ్బిలి వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
కూరగెడ్డపై వంతెన నిర్మాణానికి 2023లో పనులు ప్రారంభమైనప్పటికీ.. ఇప్పటికీ పూర్తికాకపోవడంతో సమస్య కొనసాగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానికుల సహకారంతో తాత్కాలిక నడక వంతెనను ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి నెలకొంది.
పాఠశాలకు వెళ్లాలన్న విద్యార్థులు బురద నీటిలో ములిగి వెళ్లాల్సిన పరిస్థితి అలాగే ఎమర్జెన్సీ గర్భిణీ స్త్రీలు గాని హెల్త్ పరంగా వెళ్లాలన్న వర్షాలు పడే టైంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
వర్షం వచ్చిన ప్రతిసారీ రాకపోకలపై అనిశ్చితి ఏర్పడకుండా.. కూరగెడ్డ వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి పారన్నవలసకు శాశ్వత రవాణా మార్గాన్ని అందించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు.




