Parawada: గొన్న కళాశాలలో ఘనంగా నూతన విద్యార్థుల ఓరియంటేషన్

Parawada: పరవాడ గొన్న కళాశాలలో డిప్లొమా, బీటెక్ నూతన విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. సెక్రటరీ హేమచంద్ నాయుడు, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

CHANDRA SHEKAR, PARAWADA
Published on: 4 Sept 2026 11:36 PM IST
Parawada
X

Parawada: గొన్న కళాశాలలో ఘనంగా నూతన విద్యార్థుల ఓరియంటేషన్

పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం గొన్న కళాశాలలో డిప్లొమా, బీటెక్ మరియు లేటరల్ విభాగం లో కొత్త జాయిన్ అయిన విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంను కళాశాల సెక్రటరీ హేమచంద్ నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భం గా కళాశాల గురించి ఏర్పాటు చేసిన ఆడియో,వీడియో విజువల్స్ మరియు కళాశాల గురించిన విషయాలు విద్యార్థులను,తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భం గా ప్రిన్సిపాల్ డా. పి ఎస్ యన్ మూర్తి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్ అని కొనియాడారు.

సెక్రటరీ హేమచంద్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ధైర్యం గా ప్రతి ఒక్క సమస్యలను ఎదురు ఎదుర్కోవాలని, కళాశాల అభివృద్ధి చెందిన తీరుని వివరించి కొత్తగా గొన్న ఫ్యామిలీ లో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి కళాశాల మరింత ముందుకు వెళ్లేలా తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డిప్లొమా ఇంచార్జి కె వి గణేష్,ఫస్ట్ year హెచ్ ఓ డి డా. వెంకట కిషోర్ వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు విద్యార్ధులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

CHANDRA SHEKAR, PARAWADA

CHANDRA SHEKAR, PARAWADA

Next Story