Parvathipuram: అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి ITDA PO వైశాలి
Parvathipuram: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పీవో ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు.
Parvathipuram: అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి ITDA PO వైశాలి
Parvathipuram: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్. వైశాలి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అన్ని పనుల పురోగతిని పనుల వారీగా సమీక్షించారు.
నిర్మాణంలో ఉన్న పనుల ప్రస్తుత స్థితి, పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనులు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడేలా, నిర్దేశిత ప్రమాణాలతో పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రాజెక్ట్ అధికారి పేర్కొన్నారు. పనుల అమలులో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.




