Payakaraopeta: ఎస్.రాయవరం అడ్డురోడ్డులో కంబాల జోగులు ర్యాలీ
Payakaraopeta: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం అడ్డురోడ్డు జంక్షన్ వద్ద వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట ఇన్‌చార్జి కంబాల జోగులు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ.
Payakaraopeta: ఎస్.రాయవరం అడ్డురోడ్డులో కంబాల జోగులు ర్యాలీ
పాయకరావుపేట: చంద్రబాబు వెన్నుపోటు కి రెండేళ్లు అంటూ అనకాపల్లి జిల్లా ,ఎస్.రాయవరం అడ్డురోడ్డు జంక్షన్ లో వై.సి.పి శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం కుపాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జి ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు హాజరయ్యారు.అడ్డురోడ్డు లో జోగులు క్యాంపు కార్యాలయం నుండి జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు.
ఆ ర్యాలీ లో జోగులు ,అధిక సంఖ్యలో వై.సి.పి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండళ్ళు పూర్తి అయినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. గతంలో మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోతుందని ఎద్దేవాచేశారు.
రానున్న రోజుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం అడ్డురోడ్డు జంక్షన్ ఆంజనేయ స్వామి ఆలయ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. బాబు స్యూరిటీ మోసం గ్యారంటీ ,బాబు వెన్నుపోటు కి రెండేళ్లు అంటూ నినాదాలు చేశారు.




