Chodavaram: చోడవరంలో ఘనంగా PDSO జిల్లా మహాసభ, విద్యా సమస్యలపై ఆందోళన!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరంలో పీడీఎస్‌వో ఆధ్వర్యంలో జిల్లా మహాసభ. విద్యా రంగ సమస్యలపై గళమెత్తి ప్రభుత్వ తీరును ఎండగట్టిన విద్యార్థి సంఘ నాయకులు.
Chodavaram: చోడవరంలో ఘనంగా PDSO జిల్లా మహాసభ, విద్యా సమస్యలపై ఆందోళన!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరంలో ఈరోజు PDSO ఆధ్వర్యంలో జిల్లా మహాసభ ఘనంగా జరిగింది. నూకాంబిక కళ్యాణ మండపం, చీడికాడ రోడ్ లో జరిగిన ఈ మహాసభకు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలపై ఈ సభలో తీవ్రంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో కొత్తూరు జంక్షన్ నుండి చీడికాడ రోడ్డులో గల నూకాంబికా కళ్యాణమండపం వరకు ర్యాలీ నిర్వహించి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించారు
తేదీ 03-10-2026న జరిగిన ఈ కార్యక్రమానికి PDSO జిల్లా కమిటీ సభ్యుడు బి.రాజేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తలుగా PDSO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్, జనసొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. గౌరీ శంకర్, PDSO రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎన్. రుద్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఇప్పటికీ ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేకపోవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాలేజీ విద్యార్థినులకు ఒక్క మహిళా హాస్టల్ కూడా లేకపోవడం వలన బాలికలు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు.
PDSO నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
NEP-2020 పేరుతో: 3,4,5 తరగతులను హైస్కూల్స్ లో విలీనం చేయడం వల్ల జిల్లాలో 150కి పైగా ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయని, జిల్లాలో కేవలం 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేవలం 7200 సీట్లు మాత్రమే ఉన్నాయని, దీనివల్ల ప్రతి మండలానికి ఒక డిగ్రీ, ఇంటర్, ఐటీఐ కాలేజీ లేక విద్యార్థులు వైజాగ్, గాజువాక ప్రాంతాలకు వలస వెళ్తున్నారని, గత 15 సంవత్సరాలుగా చోడవరంలో డిగ్రీ కాలేజీ లేదని, 2025లో చోడవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కేవలం 18% మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 41 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారని, దీనికి సరైన బోధన లేకపోవడమే కారణమని, హాస్టళ్లలో కనీస వసతులు లేవని - పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచడం లేదని, కుక్, కమాటి, వాచ్ మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దోమల తెరలు, ఇస్త్రీ పెట్టెలు లేవని, పాత గోడలు శిథిలావస్థకు చేరాయని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉండడం కారణంగా విద్యార్థులకు ఉన్నత చదువు భారంగా మారిందన్నారు.
అనకాపల్లిని కేంద్రంగా జెన్ జీ ఉద్యమం ఉధృతం చేస్తామని, కేవలం విద్యా శాఖ మంత్రి రాజీనామాతో అది ఆగిపోకూడదని, విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌలిక సమస్యలపై పోరాటాలు ముందుకు నడిపిస్తామని PDSO నాయకులు స్పష్టం చేశారు.
గత 15 సంవత్సరాలుగా చోడవరంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని, అదనపు గదులు, ల్యాబ్ సమస్యల పరిష్కారం కోసం, హాస్టల్ సమస్యలపై, బడి బయట ఉన్న పిల్లల కోసం పీడీఎస్ఓ పోరాటాలు చేస్తా వస్తుందని తెలిపారు.




