Visakhapatnam: 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ ప్రారంభం

Visakhapatnam: విశాఖ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్-2026. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ మహిళా నేత పేడాడ రమణికుమారి, నటుడు సుమన్.

SHIVA, BHIMILI
Published on: 23 Aug 2026 11:19 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ ప్రారంభం

విశాఖపట్నం: ఈరోజు విశాఖపట్నం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్-2026 కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా రమణికుమారి మాట్లాడుతూ మన భారతదేశంలోనే కాకుండా,విదేశాల్లో జరిగే ఛాంపియన్ షిప్ లో పాల్గొని మన భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, మన భారత దేశపు జెండా ని విదేశాల్లో ఎగురవేయాలని ఆకాంక్షిస్తూ,విద్యార్థులు అందరికీ అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో హీరో సుమన్ తల్వార్ గారు,ఆర్గనైజర్ సౌత్ ఇండియా వాడొకై కరాటే సంఘం అధ్యక్షులు,డ్రాగన్ ఫోర్స్ ఫౌండర్ &డైరెక్టర్ చిగురుపల్లి సతీష్ కుమార్ గారు,కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story