Visakhapatnam: విశాఖలో జనసేన మేయర్‌ను గెలిపించి పవన్‌కు కానుకగా ఇద్దాం!
Visakhapatnam: విశాఖపట్నంలో జనసేన అభ్యర్థిని జీవీఎంసీ మేయర్‌గా గెలిపించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కానుకగా ఇద్దామని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ పిలుపునిచ్చారు.
Visakhapatnam: విశాఖలో జనసేన మేయర్‌ను గెలిపించి పవన్‌కు కానుకగా ఇద్దాం!
Visakhapatnam: రాష్ట్రంలో కీలకమైన మహా విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ మేయర్ గా జనసేన అభ్యర్థిని గెలిపించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కానుకగా ఇవ్వాలని పార్టీ మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిలుపునిచ్చారు. జనసేన విశాఖలో అత్యంత బలంగా ఉందని గత వైసిపి ప్రభుత్వం లో ఆ ప్రభుత్వం చేపట్టిన అవినీతి అక్రమాలు భూకబ్జాలకు వ్యతిరేకంగా అన్ని రకాల పోరాటాలు చేసి ప్రజల మద్దతును కూడగట్టిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దానికి ఫలితంగా రానున్న ఎన్నికల్లో మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిని గెలిపించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టుగా ఉత్తరాంధ్రలో సుస్థిర స్థానం సంపాదించాలని పేర్కొన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు శాసనసభ్యులు ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ పార్టీని బలోపేతం చేశారని స్పష్టం చేశారు.
నగరపాలక సంస్థకు గతంలో జరిగిన ఎన్నికల్లో జనసేన ద్వారా ఎన్నికైన ముగ్గురు కార్పొరేటర్లు కౌన్సిల్లో క్రియాశీలక పాత్ర పోషించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు బీజం వేశారని తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరపాలక సంస్థ మేయర్ సీటు జనసేనకు కేటాయించటం కూటమి ధర్మమని తెలిపారు.
పవన్ కళ్యాణ్ నిర్ణయం అద్భుతం
మంగళవారం కాకినాడలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బోలోపేతం చేసే దిశగా తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని మూర్తి యాదవ్ కొనియాడారు. జనసేన బలం ఉన్న ప్రతి చోట పోటీ చేయాలని అవసరమైతే కూటమి పక్షాలతో స్నేహపూర్వక పోటీకైనా సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వటం పార్టీ కేడర్ను ఎంతగానో ఉత్సాహపరిచిందని పేర్కొన్నారు.
14 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న కేడర్ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనతో క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ బాటలో పయనించేందుకు విశాఖ జనసేన నేతలు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.




