Pendurthi: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కూటమి నాయకులు

Pendurthi: పెందుర్తిలో తుఫాను ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన కూటమి నాయకులు. యుద్ధ ప్రాతిపదికన చెట్ల తొలగింపు, సహాయక చర్యలు చేపట్టిన ఇందల వెంకటరమణ.

GOPI, PENDURTHI
Published on: 25 Sept 2026 5:56 PM IST
Pendurthi
X

Pendurthi: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కూటమి నాయకులు

పెందుర్తి: తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందల వెంకటరమణ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశాల మేరకు కూటమి నాయకులు 88వ వార్డు పరిధిలోని నరవ, కోట నరవ, గవర జగ్గయ్యపాలెం, సతివాణిపాలెం గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఇందల వెంకటరమణ మాట్లాడుతూ... "తుఫాను కారణంగా విరిగిపడిన చెట్లు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల వల్ల ప్రజలకు ఎలాంటి రవాణా, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాం. నరవ రెల్లి వీధిలో రహదారికి అడ్డంగా పడిపోయిన భారీ వృక్షాలను యుద్ధ ప్రాతిపదికన తొలగింపజేశాం.

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూటమి నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారు" అని తెలిపారు.బాధిత కుటుంబాలకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇల్లపు శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షుడు గంటకోరి శివ మరియు ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI