Pendurthi: ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు.. పెందుర్తి ఎమ్మెల్యే కీలక ప్రకటన!

Pendurthi: ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు అర్హులైన పేదలంతా దరఖాస్తు చేసుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 16 వరకు గడువు.

GOPI, PENDURTHI
Published on: 7 Sept 2026 4:36 PM IST
Pendurthi
X

Pendurthi: ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు.. పెందుర్తి ఎమ్మెల్యే కీలక ప్రకటన!

Pendurthi: ఈ రోజు అనగా 07.09.2026 తేదీ న పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల దరఖాస్తుల అంశంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అర్హులైన ప్రతి ఒక్కరూ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పేద కళాకారులు సహా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి గతంలో దరఖాస్తు చేసి ఉంటే మరోసారి అధికారులను సంప్రదించాలని

అనర్హులను ప్రోత్సహించొద్దు, అర్హత కలిగిన పేదవారికి అన్యాయం జరగకూడదని కొత్త పెన్షన్ దరఖాస్తు అవకాశాన్ని మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పాత్రికేముకంగా తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పేద కుటుంబాలకు పెన్షన్ ఆర్థిక భరోసా అని, అర్హులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.

ఓ బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌తో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నార‌ని, త‌ద్వారా స‌మాజంలో అస‌మాన‌త‌ల‌ను రూపుమాపాల‌ని యోచిస్తున్నార‌ని పేర్కొన్నారు

ఈ యొక్క పాత్రికేయ సమావేశంలో రాష్ట్ర కనీస వేతనాలు డైరెక్టర్ బల్రెడ్డి అప్పారావు గారు, సీనియర్ నాయకులు ఇందల రమణగారు,పెందుర్తి ఏం సి డైరెక్టర్ లక్కీ గోవింద్ గారు, గల్లా శ్రీనివాసరావు గారు సబ్బవరం మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు గారు, వార్డు అధ్యక్షులు కంచిపాటి మధు గారు, మాజీ సర్పంచ్ మామిడి శంకర్రావు గారు తదితర పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story