Pendurthi: ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
Pendurthi: పెందుర్తిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు.
Pendurthi: ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
పెందుర్తి: ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పెందుర్తి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సుజాతనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కార్యక్రమాలను సమన్వయం చేయాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ ఆశయాలు, ప్రజా సేవా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే విధంగా జన్మదిన వేడుకలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కోరారు.




