Pendurthi: అంతర్జాతీయ టోర్నీకి ఎంపికైన తేజస్వినికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
Pendurthi: చైనా అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ టోర్నీకి ఎంపికైన పెందుర్తి మండలం గొరపల్లికి చెందిన తేజస్వినికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రూ. లక్ష సాయం అందించారు.
Pendurthi: అంతర్జాతీయ టోర్నీకి ఎంపికైన తేజస్వినికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
పెందుర్తి: ఈ రోజు అనగా 07.09.2026 తేదీన పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో పెందుర్తి మండలం, గొరపల్లి గ్రామానికి చెందిన దంతులూరి విజయ తేజస్విని అనే 15 ఏళ్ల బాలిక చైనాలో జరుగుతున్న అండర్ 17 అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ కు ఎంపిక కావడం శుభపరిణామమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పేర్కొన్నారు.
చైనా పర్యటనకు వెళ్లిన తేజస్వినికి ఎమ్మెల్యే రమేశ్ బాబు గారు లక్ష రూపాయల ఆర్దిక సాయమందించారు. ఆమె తల్లికి నగదును అందించిన రమేశ్ బాబు గారు తేజస్వినిని ఫోనులో పలకరించి శుబాకాంక్షలు తెలియచేసారు. మెడల్ సాధించి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అనంతరం తేజస్విని తల్లి మీడియాతో మాట్లాడుతూ చిన్నప్పటి నుండి క్రీడల పట్ల ఎంతో ఆసక్తి కలిగిన తేజస్విని అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందని, తమ కుమార్తెకు ఆర్దిక సాయమందించి ప్రోత్సహించిన ఎమ్మెల్యే రమేశ్ బాబుకు కృతజ్ణతలు తెలియచేసారు.




