Madhurawada: జీవీఎంసీ 8వ వార్డులో పిల్లా అనిత ప్రజా పరిచయ యాత్ర
Madhurawada: జీవీఎంసీ 8వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా అనిత మధురవాడ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజా పరిచయం నిర్వహించారు.
Madhurawada: జీవీఎంసీ 8వ వార్డులో పిల్లా అనిత ప్రజా పరిచయ యాత్ర
మధురవాడ: జీవీఎంసీ 8వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా అనిత సోమవారం ప్రజా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను కలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు, వార్డు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా పిల్లా అనిత మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో వార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువత, అభిమానులు పాల్గొన్నారు.




