Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..!

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.

Arun Chilukuri
Published on: 1 Aug 2026 11:26 AM IST
Bhogapuram Airport
X

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..!

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర మకుటంలో మరొక వినూత్న మైలురాయి చేరింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వెంట ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

టెర్మినల్ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ భవనం లోపలకు వెళ్లి అందులోని ఆధునిక సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎమ్‌ఆర్ సంస్థ ప్రతినిధులు విమానాశ్రయ చెక్-ఇన్ హాల్, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ టెక్నాలజీ, ఎయిర్‌పోర్ట్ ప్రత్యేక రూపకల్పన వివరాలను ప్రధానికి వివరించారు.

టెర్మినల్ సందర్శనలో భాగంగా ప్రధాని మోదీ విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, భవిష్యత్తులో ఇక్కడ ఏర్పాటు చేయనున్న ఏవియేషన్ హబ్ మరియు ఏవియేషన్ ఎడ్యుసిటీ మోడల్స్ (నమూనాలు)ను ప్రత్యేకంగా ఆసక్తిగా పరిశీలించారు. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, విమానయాన రంగాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు ప్రధానికి వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story