Paderu: తోట్లగొందిలో పొలంబడి: వరిలో ఆకుముడత పురుగు నివారణపై అవగాహన
Paderu: పాడేరు మండలం తోట్లగొందిలో నిర్వహించిన పొలంబడిలో వరి పంటను ఆశించే ఆకుముడత పురుగు నివారణ పద్ధతులను రైతులకు అధికారులు ప్రాక్టికల్‌గా వివరించారు.
Paderu: తోట్లగొందిలో పొలంబడి: వరిలో ఆకుముడత పురుగు నివారణపై అవగాహన
పాడేరు: పాడేరు మండలం తోట్ల గొంది గ్రామంలో పొలంబడి కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస శుక్రవారం నిర్వహించారు.
వరిలో ఆకుముడత పురుగు నివారణ గురించి వేప నూనె ఐదు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారి చేయటం ఆకు ముడత పురుగు నివారించవచ్చు మరియు పైరుపై కొబ్బరి తాడు లాగుడు వలన ఆకుమూడత యొక్క గొంగళి పురుగులు నీటిలో పడి చనిపోతాయి కొబ్బరి తాడు పైరు పై లాగటం రైతులకు ప్రాక్టికల్ గా చేసి చూపించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్, గ్రామ వ్యవసాయ సహాయకులు రంజిత్ మరియు రైతులు పాల్గొన్నారు.




