Narsipatnam: వినాయక నిమజ్జనం డీజే సౌండ్‌పై నియంత్రణ – టౌన్ సీఐ గఫూర్ హెచ్చరిక!
Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ నియంత్రణపై ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన టౌన్ సీఐ గఫూర్.
Narsipatnam: వినాయక నిమజ్జనం డీజే సౌండ్‌పై నియంత్రణ – టౌన్ సీఐ గఫూర్ హెచ్చరిక!
Narsipatnam: గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్‌పై నియంత్రణ – నిర్వాహకులతో సమావేశం.. టౌన్ సీఐ గఫూర్
గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మరియు డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించాము.
ఈ సందర్భంగా క్రింది సూచనలు పాటించాలని సూచించాము:
డీజే సౌండ్ సిస్టమ్‌ను అధిక శబ్దంతో వినియోగించరాదు. ప్రభుత్వ నిబంధనలు మరియు అనుమతించిన శబ్ద పరిమితులకు లోబడి మాత్రమే సౌండ్ సిస్టమ్‌ను ఉపయోగించాలి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి.
మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం, గొడవలకు పాల్పడడం లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడడం తప్పనిసరిగా నివారించాలి. అశ్లీలతకు లేదా ఇతరులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్న పాటలు, నృత్యాలు లేదా ప్రదర్శనలు నిర్వహించరాదు.
గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో మరియు క్రమశిక్షణతో నిర్వహించాలి. ప్రజలందరూ పోలీసు శాఖ సూచనలను పాటించి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరుతున్నాము.




