Anakapalli: సంవత్సరం తర్వాత దొరికిన ధ్రువపత్రాలు - బాధితునికి అందజేసిన పోలీసులు

Anakapalli: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పోలీసుల నిజాయితీ.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 15 Jun 2026 1:36 PM IST
Anakapalli
X

Anakapalli: సంవత్సరం తర్వాత దొరికిన ధ్రువపత్రాలు - బాధితునికి అందజేసిన పోలీసులు

Anakapalli: ఏడాది క్రితం ఉపాధి కోసం అసోం రాష్ట్రానికి చెందిన చందన్ అనే యువకుడు అనకాపల్లి జిల్లా లోని అచ్యుతాపురం వచ్చారు. సెజ్ కంపెనీల్లో పనిచేసుకొని జీవించాలనుకున్నాడు.

అర్హత ధ్రువపత్రాలతో కంపెనీలు చుట్టూ తిరుగుతున్న సమయంలో వీటిని ఎక్కడో జార విడుచుకున్నాడు. దీంతో ఎక్కడా ఉద్యోగం లభించలేదు. దానితో ఏం చేయాలో తోచని స్థితిలో అచ్యుతాపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి సొంతరాష్ట్రం వెళ్లిపోయాడు.

రెండు రోజుల క్రితం పరవాడలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మురళీకృష్ణకు చందన్ ధ్రువపత్రాలు దొరకడంతో వీటిని అచ్యుతాపురం పోలీసు స్టేషన్లో అప్పగించారు. వాటిని పరిశీలించిన పోలీసులు చందన్ను పిలిపించి ఎస్సై పోషణ చేతుల మీదుగా అందించారు.

ఏడాది క్రితం పోయిన ధ్రువపత్రాలు మళ్లీ చేతికి అందడంతో ఆనందం వ్యక్తం చేసిన చందన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇంక దొరకవనుకుని ఆశ వదులుకున్న సమయంలో దొరకడం ఆనందంగా ఉందని చందన్ తెలిపారు.

సంవత్సరం గడిచినా ధ్రువపత్రాలు దొరకడం లో ప్రత్యేక చొరవ తీసుకున్న పోలీసులను పలువురు అభినందిస్తున్నారు

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story