Vizag: అరణ్య మిత్రులుగా మారదాం.. ప్రాణికోటిని కాపాడుదాం!
Vizag: వేసవిలో పశుపక్ష్యాదుల దాహార్తిని తీర్చాలని భారతీయ కిసాన్ సంఘ్ నేత జలగం కుమారస్వామి కోరారు.
Vizag: అరణ్య మిత్రులుగా మారదాం.. ప్రాణికోటిని కాపాడుదాం!
Vizag: పశుపక్ష్యాదుల కు నీరు అందుబాటులో ఉంచాలి అని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి అని పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మధురవాడ లో అయోధ్య నగర్ లోని ధాత్రి ఫౌండేషన్ అధ్యక్షురాలు విశాలాక్షి నేతృత్వంలో పశుపక్ష్యాదులకు నీరు విద్యార్దులతో అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది .
అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ సమస్త జీవరాశినీ కాపాడటమే మానవత్వం అని వివరించారు. అలాగె అరణ్య మిత్రులు గా ప్రతి ఒక్కరూ మారాలి అని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో దాహార్తితో నీరు అందుబాటులో లేకపోవడం వల్ల ఏ జీవి అంతరించి పోకుండా ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజలు, ప్రధానంగా విద్యార్థులు అందరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించుదాం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, ధాత్రి ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ దీనబందు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, పలువురు విద్యార్థులు పాల్గొని మాట్లాడారు.




