Anakapalli: రైల్వే జీఎం సందీప్ మాతూర్ తనిఖీలు అభివృద్ధి పనులపై సమీక్ష!

Anakapalli: సౌత్ కోస్ట్ రైల్వే డివిజన్ ఏర్పడిన తర్వాత తొలి అధికారిక పర్యటనలో భాగంగా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాతూర్ అనకాపల్లి రైల్వే స్టేషన్‌ను పరిశీలించి.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 11 July 2026 10:03 PM IST
Anakapalli
X

Anakapalli: రైల్వే జీఎం సందీప్ మాతూర్ తనిఖీలు అభివృద్ధి పనులపై సమీక్ష!

అనకాపల్లి: రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి, ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ పర్యటనలో విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) మోహిత్ సోనాకియా, విజయవాడ, విశాఖపట్నం డివిజన్లకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్టేషన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రయాణికుల సౌకర్యాలు, పార్కింగ్ నిర్వహణ తదితర అంశాలను జీఎం క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన రైల్వే జీఎం సందీప్ మాతూర్ మాట్లాడుతూ... వచ్చే ఏడాది రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో జరిగే గోదావరి పుష్కరాల దృష్ట్యా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. పుష్కరాల నాటికి అన్ని పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఆ తర్వాత అనకాపల్లి, తుని, సామర్లకోట వంటి ప్రధాన రైల్వే స్టేషన్లను సందర్శించి అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించినట్లు వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే డివిజన్ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఉన్నతస్థాయి అధికారులు సందర్శించడం ఇదే తొలి పర్యటన అని పేర్కొన్నారు.

అలాగే అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న డిమాండ్లను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైల్వే జీఎం సందీప్ మాతూర్ స్పష్టం చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story