Narsipatnam: నర్సీపట్నంలో వర్షంలోనూ టీడీపీ భారీ ర్యాలీ
Narsipatnam: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల ముగింపు వేళ వర్షంలోనూ చైర్పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి, ఎంపీ చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో టీడీపీ భారీ ర్యాలీ నిర్వహించింది.
Narsipatnam: నర్సీపట్నంలో వర్షంలోనూ టీడీపీ భారీ ర్యాలీ
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం 24, 25వ వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ఆఖరి ఘట్టం ఉత్సాహంగా సాగింది. మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ నాయకులు, కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి, రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ వార్డుల్లో విస్తృతంగా పర్యటించి, తడుస్తూనే ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చింతకాయల విజయ్ మాట్లాడుతూ.. సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని, ఆ నిబద్ధతను ప్రజలు గుర్తించాలని కోరారు. అవినీతి సొమ్ముతో ఓట్లు అడిగే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవాలన్నా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ గెలిస్తే అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తామని, వార్డుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
ఓటింగ్ విధానంపై ఆయన స్పష్టత ఇస్తూ.. కౌన్సిలర్ అభ్యర్థికి తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లో మొదటి స్థానంలో ఉన్న సైకిల్ గుర్తుపై, చైర్ పర్సన్ అభ్యర్థి పద్మావతికి గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లో రెండో స్థానంలో ఉన్న సైకిల్ గుర్తుపై ముద్ర వేసి, రెండు మడతలు పెట్టి బ్యాలెట్ బాక్సులో వేయాలని ఓటర్లకు సూచించారు.
చైర్పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి మాట్లాడుతూ.. 25వ వార్డు అభ్యర్థి లక్ష్మీ గణేశ్ యువకుడు విద్యమంతుడు, సేవపరుడు అలాంటి వ్యక్తిని కౌన్సిలర్‌గా గెలిపిస్తే వార్డుకు మరింత సేవ చేస్తారని, టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నర్సీపట్నంలో స్వచ్ఛ నర్సీపట్నం గా తీర్చిదిద్దుతానని ఆమె అన్నారు. బ్యాలెట్ పేపర్లో రెండవ నెంబర్ పై ఉన్న పద్మావతి చింతకాయల పేరుపై సైకిల్ గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో 23వ వార్డు అభ్యర్థి ఆదిలక్ష్మి, 24వ వార్డు అభ్యర్థి బేట దుర్గ దేవి, 25వ వార్డు అభ్యర్థి గవిరెడ్డి లక్ష్మి గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జిఎన్ఆర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్షంలోనూ స్థానికులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ప్రచారం విజయవంతంగా ముగిసింది.




