Sirigindalapadu: సిరిగిందలపాడులో రామకృష్ణ మిషన్ ఉచిత వైద్య శిబిరం

Sirigindalapadu: రాజమండ్రి రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో సిరిగిందలపాడులో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి 200 మందికి ఉచిత వైద్యసేవలు అందించారు.

Prasanna, Rampachodavaram
Published on: 8 Nov 2026 5:19 PM IST
Sirigindalapadu
X

Sirigindalapadu: సిరిగిందలపాడులో రామకృష్ణ మిషన్ ఉచిత వైద్య శిబిరం

Sirigindalapadu: రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమండ్రీ వారి అధ్వర్యంలో లో స్థానిక, సిరిగిందలపాడు లో రామకృష్ణ మిషన్ వద్ద ఆదివారం ప్రత్యేక వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ తెలియచేసినారు. ఈ వైద్య శిబిరంలో డా రాయుడు శ్రీనివాస్ గారు, దాసరి ఉమా మహేష్ గారు, , డా వెలమ స్నేహా మాధురి గారు, పాల్గొని సుమారు 200 మందికి వైద్యసేవలు అందించారు.

అవసరం అయిన వారికి 53 మందికి రక్త నీరుడు పరీక్షలు, 04 కి ఇ. సి. జి. లు,8 మందికి కి థైరాయిడ్ పరీక్షల, 07 గురి కి ఎక్స్ రే, లు , 20 మందికి, ఫిజియథెరపీ లు చేసినట్లు స్వామిజీ తెలియచేసినారు. జీ బి ఆర్ . ట్రస్ట్ బాపట్ల డాక్టర్ గోపాలం శివన్నారాయణ వారి బృందం చే 44 మంది రోగులకు నాలుగు నెలలు కు సరిపడా మందులు ఇవ్వటం జరిగింది.

ఈ వైద్య శిబిరం లో పాల్గొన్న రోగులకు జీ.బి. ఆర్ ట్రస్ట్ వాలంటీర్ బల్లెం సాయిరాజ్ (వృత్తిరీత్యా ఉపాధ్యాయులు )మూర్ఛ రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలు , సంపూర్ణ ఆరోగ్యం ఉండటానికి తీసుకోవలసిన చర్యలు , ప్రతి రోజు కొంత సమయం వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనం గురించి చక్కగా వివరించటం జరిగింది.

ఈ కార్యక్రమంలో.రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్ మరియు సిబ్బంది వాలంటీర్ గిరిరాజ్ కృష్ణ ,సత్యనారాయణ పాల్గొన్నారు. రోగులు సహాయకులకు అన్నదానం నిర్వహించి నట్లు స్వామిజీ తెలియచేసినారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram