Rampachodavaram: రంపచోడవరంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం!
Rampachodavaram: రాజమండ్రి రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం సిరిగిందలపాడులో ఆదివారం 200 మందికి ఉచిత వైద్య పరీక్షలు, అన్నదానం నిర్వహించారు.
Rampachodavaram: రంపచోడవరంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం!
రంపచోడవరం: రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమండ్రీ వారి అధ్వర్యంలో లో స్థానిక సిరిగిందలపాడు రామకష్ణ మిషన్ వద్ద ఆదివారం వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తెలియచేసినారు.
ఈ వైద్య శిబిరంలో డాక్టర్ దాసరి ఉమా మహేష్ , డాక్టర్ శ్రీనివాస్ రాయుడు డాక్టర్ వెలమ స్నేహామాధురి పాల్గొని సుమారు 200 మందికి వైద్యసేవలు అందించారు. అవసరం అయిన వారికి 62 మందికి రక్త నీరుడు పరీక్షలు 3 ఇ. సి. జి. లు , X రే లు 9 మందికి కి , థైరాయిడ్ పరీక్షలు 6 మందికి, 12 ఫిజియథెరపీ లు చేసినట్లు స్వామీజి తెలియచేసినారు.
ఈ వైద్య శిబిరం లో రామకృష్ణ మిషన్ రాజమండ్రి సహాయ కార్యదర్శి శ్రీమత్ స్వామి సేవ్యా నందజీ మహారాజ్ పాల్గొని జీవుని సేవే దేవుని సేవ గురించి తెలియ చేసినారు, స్వామి వివేకానంద చెప్పినట్లుగా సజీవంగా ఉన్న మనిషికి సేవ చేస్తే భగవంతునికి సేవ నట్లు అని స్వామిజీ చెప్పినారు.
ఇక్కడ ఉన్న వారు అందరూ ఎవరి స్థాయిలో వారు ఇతరులకి సేవ చెయ్యాలని, భక్తి భావం కలిగి ఉండాలని, భగవంతుణ్ణి నామ స్మరణ అలవాటు చేసుకోవలని, ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లు కలిగి ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలని స్వామీజీ చెప్పారు.
ఈ వైద్య శిబిరం ను రామక్రిష్ణ మిషన్ రాజమండ్రి సహాయ కార్యదర్శి స్వామి సేవ్యా నంద జీ పర్యవేక్షించారు. ఈ వైద్య శిబిరం లో రామక్రిష్ణ మిషన్ వైద్య సేవల సమన్వయ కర్త కానుమోను శ్రీనివాస్, లక్క వెంకటేష్, ఇంజనీర్. బి.ఆర్.ఎస్ శ్రీకాంత్ పాల్గొన్నారు. రోగులు సహాయకులకు అన్నదానం నిర్వహించి నట్లు స్వామిజీ తెలియచేసినారు.




