Kanchili: కంచిలి తహసీల్దార్‌ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం!

Kanchili: తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అందేలా చూడాలని తహసీల్దార్ సూచించారు.

G.RAMBABU, SOMPET
Published on: 21 Aug 2026 8:46 AM IST
Kanchili
X

Kanchili: కంచిలి తహసీల్దార్‌ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం!

Kanchili: కంచిలి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు సక్రమంగా అందేలా డీలర్లు బాధ్యతగా వ్యవహరించాలని తహసీల్దార్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం రేషన్‌ డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రేషన్‌ సరుకుల పంపిణీ తీరును, లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలను డీలర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు సరుకుల పంపిణీ చేపట్టాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సకాలంలో రేషన్‌ అందేలా చూడాలని సూచించారు. పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.

లబ్ధిదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీలర్లకు సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందించడంలో డీలర్లు కీలక పాత్ర పోషించాలని తహసీల్దార్‌ పేర్కొన్నారు.

సమావేశంలో మండలంలోని రేషన్‌ డీలర్లు కొత్తకోట నాగరాజు, విజయ్ బాబు, తమరాల ధనుంజయ, ప్రసాద్ , ఋషి తదితర డీలర్లు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story