Anakapalli: అనకాపల్లి ఆలయంలో శ్రావణ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన రాంకీ!
Anakapalli: అనకాపల్లి గవరపాలెంలోని సంతోషిమాత ఆలయంలో శ్రావణమాస ఉత్సవ ఏర్పాట్లను జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ పరిశీలించి సమీక్షించారు.
Anakapalli: అనకాపల్లి ఆలయంలో శ్రావణ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన రాంకీ!
Anakapalli: గవరపాలెంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో, మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ సంతోషిమాత దేవాలయ శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లపై జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ సమీక్ష నిర్వహించారు.
ఆలయంలో కొనసాగుతున్న ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన రాంకీ.. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
భక్తులకు ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పించేలా దేవస్థాన అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాంకీ సూచించారు.
శ్రావణమాస ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రాంకీ స్పష్టం చేశారు.




