Rampachodavaram: మన్యంలో విద్యుత్ సిబ్బంది సాహసం: భారీ వర్షంలోనూ సేవలు
Rampachodavaram: రంపచోడవరం డివిజన్లో కురిసిన భారీ వర్షాల్లోనూ ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో శ్రమించి నిరంతర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
Rampachodavaram: మన్యంలో విద్యుత్ సిబ్బంది సాహసం: భారీ వర్షంలోనూ సేవలు
పోలవరం జిల్లా, రంపచోడవరం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) రంపచోడవరం డివిజన్ పరిధిలోని రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, దేవీపట్నం మండలాల్లో ఇటీవల భారీ వర్షపాతం 102 నుండి 138mm వరకు నమోదైనప్పటికీ మరియు నిరంతరముగా వర్షం పడుతున్నప్పటికీ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సిబ్బంది నిరంతరం విధులు నిర్వహించారు.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ సిబ్బంది రాత్రింబవళ్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ లైన్లలో స్తంబాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు క్రొత్త వాటిని అమర్చారు మరియు విద్యుత్ సామాగ్రి పాడయిన వాటిని గుర్తించి మరమ్మతులు చేపట్టారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ త్వరితగతిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది చేసిన కృషిని స్థానిక ప్రజలు అభినందించారు.
ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పనిచేసిన విద్యుత్ శాఖ సిబ్బందిపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.




