Anakapalli: అనకాపల్లిలో నేడు రావు గోపాల్ రావు కళాకేంద్రం పునఃప్రారంభం!
Anakapalli: రూ. 5.16 కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన డాక్టర్ రావు గోపాల్ రావు కళాకేంద్రం నేడు పునఃప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత
Anakapalli: అనకాపల్లిలో నేడు రావు గోపాల్ రావు కళాకేంద్రం పునఃప్రారంభం!
అనకాపల్లి: ప్రతిష్టాత్మక డాక్టర్ రావు గోపాల్ రావు కళాకేంద్రం పునఃప్రారంభోత్సవం నేడు సాయంత్రం 4 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మరియు VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో కళాకేంద్రాన్ని పునర్నిర్మించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జి భీమశెట్టి రామ్కీ కళాకేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోటమ నాయకులు కూడా పాల్గొన్నారు ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, నిర్వాహకులకు పలు సూచనలు చేస్తూ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఆయన తెలిపారు.
సుమారు రూ.5.16కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో పునర్నిర్మించిన ఈ కళాకేంద్రం అనకాపల్లి సాంస్కృతిక రంగానికి కొత్త ఊపునివ్వనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.




